TG: మజ్లిస్ బచావో తెహ్రిక్(MBT) ఆధ్వర్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతికి సంఘీభావంగా హైదరాబాద్ పాతబస్తీలో ర్యాలీ నిర్వహించారు. చంచల్‌గూడ నుంచి దారుల్షిఫా వరకు జరిగిన ఈ ర్యాలీలో ఎంబీటీ ప్రతినిధి, మాజీ కార్పొరేటర్ అమ్జద్ ఉల్లా ఖాన్ ఖలీద్ పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఖమేనీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించారు. శాంతియుతంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంఘీభావ నినాదాలు చేస్తూ ఆయన సేవలను స్మరించారు.