
మెకిన్సెలో వేలాది ఉద్యోగాల కోత?
ప్రపంచ ప్రఖ్యాత కన్సల్టింగ్ సంస్థ మెకిన్సె అండ్ కంపెనీలో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోతపై చర్చలు జరుగుతున్నాయని బ్లూమ్ బర్గ్ నివేదిక వెల్లడించింది. క్లయింట్ లతో నేరుగా సంబంధం లేని నాన్ క్లయింట్ ఫేసింగ్ పాత్రల్లో ఉన్న ఉద్యోగుల్లో సుమారు 10 శాతం మందిని తొలగించే అవకాశం ఉందని సమాచారం. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే వచ్చే 18-24 నెలల్లో వేలాది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది.మారుతున్న మార్కెట్ పరిస్థితులు, ఏఐ, ఆటోమేషన్ వంటి టెక్నాలజీల ప్రభావం వల్ల ఖర్చుల నిర్మాణంపై ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది.




