మెగాస్టార్ చిరంజీవి నివాసంలో వినాయక చవితి వేడుకలు అంబరాన్నంటాయి. రామ్ చరణ్,
ఉపాసన, కుటుంబ సభ్యులంతా కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయ దుస్తుల్లో మెగా కుటుంబ సభ్యులు పాల్గొన్న ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. అభిమానులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన రామ్ చరణ్, అందరికీ ఆనందం, శ్రేయస్సు కలగాలని ఆకాంక్షించారు. చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న #RC17 వంటి భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు.