
చికెన్ పకోడి కోసం అన్నను గొడ్డలితో నరికి చంపిన తమ్ముడు
AP: కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో శనివారం రాత్రి మద్యం మత్తులో అన్నదమ్ములు వెంకటసుబ్బయ్య, సురేష్‌ల మధ్య చికెన్ పకోడి విషయంలో గొడవ జరిగింది. దీంతో ఆగ్రహించిన తమ్ముడు సురేష్.. ఇంట్లోని గొడ్డలితో వెంకటసుబ్బయ్యను దారుణంగా నరికాడు. తీవ్ర రక్తస్రావంతో వెంకటసుబ్బయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేవలం చిన్నపాటి గొడవ మద్యం మత్తుతో ప్రాణం తీసే స్థాయికి చేరడం స్థానికంగా కలకలం రేపింది.




