
పంట పొలాల్లో ఏనుగులు.. భయాందోళనలో రైతులు (వీడియో)
AP: చిత్తూరు జిల్లాలో ఏనుగులు హల్చల్ చేశాయి. రామకుప్పం మండల పరిధిలో పంట పొలాలను ఏనుగులు నాశనం చేశాయి. గత 15 రోజులుగా రెండు ఏనుగులు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నమియాల, జీడిమకులపల్లి, రామాపురం తండా పరిసర ప్రాంతాల్లో ఏనుగులు సంచరిస్తున్నాయి. దాంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు.




