
థాయ్-కంబోడియా మధ్య సైనిక ఘర్షణ.. 8 మంది మృతి
థాయ్లాండ్-కంబోడియా సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో ఎనిమిది మంది మరణించగా, డజన్ల కొద్దీ గాయపడ్డారు. థాయ్ సైనిక కాల్పుల్లో ఏడుగురు కంబోడియా పౌరులు మరణించారని, 20 మంది గాయపడ్డారని కంబోడియా జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. థాయ్ సైన్యం తమ వైపు నుంచి ఓ సైనికుడు మరణించాడని, 18 మంది గాయపడినట్లు ధృవీకరించింది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ట్రంప్ జోక్యంతో కుదిరిన శాంతి ఒప్పందం ఐదు నెలల్లోనే విఫలమైంది.




