
ఆఫ్ఘన్-పాక్ సరిహద్దులో కాల్పులు.. 15 మంది మృతి
ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మంగళవారం పాక్ దళాలు ఆఫ్ఘన్ సరిహద్దు ప్రాంతాలపై దాడులు చేయడంతో 15 మంది పౌరులు మరణించినట్లు ఆఫ్ఘన్ తాలిబాన్ అధికారులు తెలిపారు. ప్రతీకార దాడుల్లో పాకిస్తాన్ సైనిక పోస్టులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పాకిస్తాన్ మాత్రం తమ దాడుల్లో 200 మందికి పైగా తాలిబాన్లు హతమైనట్లు, 28 మంది పాక్ సైనికులు మరణించినట్లు చెబుతోంది.




