కొండగట్టు ఈఓగా బాధ్యతలు స్వీకరించిన రమాదేవి

12చూసినవారు
TG: జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రం ఫుల్ ఛార్జ్ ఈఓగా రమాదేవి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. సామాన్య, వీఐపీ భక్తులను సమానంగా చూడాలని అధికారులకు సూచించారు. త్వరలోనే ఆలయంలో ఆన్‌లైన్ సేవలు ప్రారంభిస్తామని, భక్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆమె స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్