
కృష్ణా నదికి పెరుగుతున్న వరద
మొంథా తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద పెరుగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, పులిచింతల, ప్రకాశం బ్యారేజీల వద్ద వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో 2.74 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఇది 5 లక్షల క్యూసెక్కుల వరకు చేరే అవకాశం ఉందని, ఆ తర్వాత తగ్గుతుందని అంచనా.




