బర్కత్‌పురా పీఎఫ్ ఆఫీస్ వద్ద నిలిపి ఉంచిన టూ వీలర్‌లో మంగళవారం గ్రీన్ స్నేక్ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వాహనదారుడు బైక్ స్టార్ట్ చేయగానే ఇంజిన్ వద్ద పాము కనిపించడంతో వెంటనే అప్రమత్తమై వాహనాన్ని నిలిపివేశాడు. కర్ర సాయంతో పామును బయటకు తీయడంతో ప్రమాదం తప్పింది. చాలా కాలం నిలిపి ఉంచిన వాహనాలను తీసేటప్పుడు జాగ్రత్తగా తనిఖీ చేయాలని స్నేక్ సొసైటీ సిబ్బంది సూచిస్తున్నారు.