అమెరికాలో దారుణ హత్యకు గురైన గుండ్లపోచంపల్లి గ్రామానికి చెందిన కుంచ అన్షుల్ మృతదేహం శనివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో స్వగ్రామానికి చేరుకుంది. మృతదేహాన్ని చివరిసారి చూసేందుకు బంధువులు, స్నేహితులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. ఉదయం నుంచే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు నివాళులర్పిస్తున్నారు. అనంతరం ఉదయం 10 గంటల సమయంలో అంతిమ కార్యక్రమాలు నిర్వహించి, తిరుమలగిరి సుభాస్‌నగర్ శ్మశానవాటికలో దహన సంస్కారాలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అన్షుల్ అకాల మరణం గుండ్లపోచంపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.