శుక్రవారం అత్తాపూర్ లో ఫైర్ సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘించిన ఓ భవనాన్ని హైడ్రా అధికారులు సీజ్ చేశారు. ఇటీవల నాంపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో, నిబంధనలు పాటించని భవనాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అత్తాపూర్ లోని భవన నిర్వాహకులు నిబంధనలను పూర్తిగా పాటించలేదనే ఆరోపణలతో అధికారులు చర్యలు చేపట్టారు.