గోల్డ్ మ్యాన్ కాదు.. రోల్డ్ గోల్డ్ మ్యాన్

815చూసినవారు
గోల్డ్ మ్యాన్ కాదు.. రోల్డ్ గోల్డ్ మ్యాన్
ప్రజల్లో గుర్తింపు, సినిమా అవకాశాల కోసం 'గోల్డ్ మ్యాన్'గా చెప్పుకున్న పాతబస్తీకి చెందిన సూర్యాభాయ్ అలియాస్ పల్లపు సురేశ్ కుమార్ భాగోతం ఐటీ అధికారుల విచారణలో వెలుగులోకి వచ్చింది. ఆయన ధరించే 32 రకాల ఆభరణాలు రాగితో చేసి రోడియం పూత వేసినవని, వాటి విలువ కేవలం 3 లక్షల రూపాయలేనని అధికారులు తేల్చారు. ధనవంతుడిగా కనిపించేందుకు ఈ నకిలీ ఆభరణాలను వాడినట్లు విచారణలో వెల్లడైంది.

సంబంధిత పోస్ట్