భగవద్గీతా శ్లోకాలతో మార్మోగిన చేవెళ్ల

5చూసినవారు
భగవద్గీతా శ్లోకాలతో మార్మోగిన చేవెళ్ల
హిందూ పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టినరోజు పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం చేవెళ్ల గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో గీతయజ్ఞం నిర్వహించారు. గ్రామ హనుమాన్ దేవాలయ కమిటీ, విశ్వహిందూ పరిషత్, చేవెళ్ల గ్రామ గీతావాణి, మాతృశక్తి, సేవికా సమితి సభ్యులు సామూహిక భగవద్గీతా పారాయణం చేశారు. గీతావాణి కమిటీ సభ్యులు మహిళా మణులు ఏకరూప దుస్తులు ధరించి 18 అధ్యాయాల భగవద్గీత శ్లోకాలను పటించారు. శ్రీపాద పంతులు ఆధ్వర్యంలో వేద పండితులు మంత్రోచ్చారణలతో గీతా యజ్ఞము, హోమం నిర్వహించారు. హరే రామ హరే రామ, హరే కృష్ణ హరే కృష్ణ నామ సంకీర్తనలతో చేవెళ్ల గ్రామం మార్మోగింది.

ట్యాగ్స్ :