చేవెళ్ల పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో చేవెళ్ల మండలం మున్సిపాలిటీల సమావేశం జరిగింది. ఈనెల 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సంబంధించిన సన్నాహక సమావేశం ఇది. ఈ సమావేశంలో విభజన గురించి చర్చించి, పలువురిని ఇన్చార్జిలుగా నియమించారు. ఈ కార్యక్రమంలో వెంకట్ రెడ్డి, తిరుపతిరెడ్డి, మాణిక్ రెడ్డి, సర్పంచ్ అశోక్, సిర శీను, ఉమా శంకర్ రెడ్డి, పత్తి సత్యనారాయణతో పాటు కార్యకర్తలు, మండల, జిల్లా నాయకులు పాల్గొన్నారు.