చేవెళ్ల నియోజకవర్గం నవాబ్ పేట్ మండలం ఎల్లకొండ గ్రామంలోని పార్వతి పరమేశ్వర స్వామి వార్లను శనివారం చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య, వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, కలెక్టర్ జైన్ మతస్థులకు సంబంధించిన పురాతన విగ్రహాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.