రిటైల్ చికెన్ సెంటర్లకు మార్జిన్ పెంచాలని డిమాండ్ చేస్తూ చెవెల్లా నియోజకవర్గంలో దాదాపు 500కు పైగా చికెన్ షాపులు మూతపడ్డాయి. రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈ నిరసన జరుగుతోంది. మార్జిన్ తగ్గడంతో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నామని, పౌల్ట్రీ కంపెనీలు స్పందించే వరకు బంద్ కొనసాగిస్తామని వ్యాపారులు తెలిపారు. ఈ వ్యాపారంపై ఆధారపడిన వందలాది కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని చికెన్ షాపు యజమాని జమాల్పూర్ చందూలాల్ ఆవేదన వ్యక్తం చేశారు.