చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డిని సీఎం రేవంత్ పరామర్శించారు. ఇటీవల రంజిత్ రెడ్డి తల్లి చంద్రకళమ్మ మృతిచెందారు. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం చంద్రకళమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.