రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్‌పల్లి, పర్వేద గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదం జరిగింది. శంకర్‌పల్లి వైపు నుండి అతివేగంగా వస్తున్న ఆటో, పర్వేద గ్రామం నుండి శంకర్‌పల్లికి వెళ్తున్న టూ వీలర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టూ వీలర్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి, కాలు విరిగినట్లు సమాచారం. ప్రమాదానికి గురైన బైక్ నంబర్ AP 28 BW 6576 కాగా, ఆటో నంబర్ TG 34 T 5733గా గుర్తించారు. స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని శంకర్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.