మాజీ కౌన్సిలర్ చింటూ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

తల్లిని కోల్పోయిన మాజీ కౌన్సిలర్ చింటూ మరియు వారి కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పరామర్శించారు. ఈ సందర్భంగా మాతృవియోగంతో ఉన్న కుటుంబానికి గాఢ సానుభూతి వ్యక్తం చేసి, ఈ కష్ట సమయంలో ధైర్యంగా నిలవాలని ఓదార్పు పలికారు. పరామర్శించిన వారిలో బీఆర్ఎస్ నాయకులు లక్ష్మణ్ నాయక్, వెంకట్రాం రెడ్డి, రంగయ్య గౌడ్ తదితరులు ఉన్నారు.
