AISA తెలంగాణ రాష్ట కో - కన్వీనర్ గా గోటూరి చరణ్ గౌడ్ ఎన్నిక

1చూసినవారు
AISA తెలంగాణ రాష్ట కో - కన్వీనర్ గా గోటూరి చరణ్ గౌడ్ ఎన్నిక
ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) తెలంగాణ రాష్ట్ర కో-కన్వీనర్‌గా చరణ్ గౌడ్ ఎన్నికయ్యారు. సోమవారం రోజున ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్‌లో నిర్వహించిన AISA రాష్ట్ర వర్క్‌షాప్‌లో 21 మందితో నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చరణ్ గౌడ్‌ను రాష్ట్ర కో-కన్వీనర్‌గా ఎన్నుకున్నారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ, విద్యారంగ సమస్యల పరిష్కారం, సమానత్వంతో కూడిన విద్యా వ్యవస్థ సాధన కోసం నిరంతరం పోరాడుతానని చరణ్ గౌడ్ తెలిపారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి, సహచర కామ్రేడ్లకు కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్