రోడ్డు ప్రమాద మృతుల కుంటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన మంత్రి పొన్నం

4చూసినవారు
రోడ్డు ప్రమాద మృతుల కుంటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన మంత్రి పొన్నం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 10 మహిళలు, 8 పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు. ఈ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ.50 వేల చొప్పున సాయం ప్రకటించారు.