మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలుకూరులో అక్టోబర్ 27న రాత్రి 9 గంటల సమయంలో కనగల్ల శ్రీలత (30) అనే మహిళ తన కూతురు రిషికను ఇంట్లో వదిలి బయటకు వెళ్లి అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా శ్రీలత ఇలాగే వెళ్లి కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.