రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని జనవాడ బంగారు మైసమ్మ ఆలయం వద్ద శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. యూటర్న్ తీసుకుంటున్న ఓ ట్యాంకర్ ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డారు. ట్యాంకర్ డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్యాంకర్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.