ట్రాఫిక్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన శంకరయ్య

219చూసినవారు
ట్రాఫిక్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన శంకరయ్య
గతంలో లా అండ్ ఆర్డర్‌తో పాటు పలు విభాగాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించిన శంకరయ్య, షాద్‌నగర్ ట్రాఫిక్ సీఐగా బాధ్యతలు స్వీకరించారు. పోలీసు శాఖలో క్రమశిక్షణ, ప్రజలకు అందుబాటులో ఉండే స్వభావంతో మంచి గుర్తింపు పొందిన ఆయన, ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. పట్టణంలో పెరుగుతున్న వాహన రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్