రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో బుధవారం విషాదకర సంఘటన చోటు చేసుకుంది. షాబాజ్ చౌరస్తా వద్ద స్కూల్ బస్సు కోసం వేచి చూస్తున్న సాత్విక్‌రెడ్డి అనే విద్యార్థిని అటుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.