రూ.50 వేలు చోరీ.. మహిళ ఫిర్యాదు

293చూసినవారు
రూ.50 వేలు చోరీ.. మహిళ ఫిర్యాదు
చేవెళ్లలోని కెనరా బ్యాంకులో రుణం చెల్లించడానికి వచ్చిన మహిళ స్వప్న నుంచి గుర్తు తెలియని మహిళ రూ.50 వేలు దొంగిలించింది. కౌంటర్ వద్ద నగదు కవర్ ఇచ్చినప్పుడు రూ.50 వేలు తక్కువగా ఉన్నాయని క్యాషియర్ చెప్పడంతో స్వప్నకు విషయం తెలిసింది. సీసీ కెమెరాలు పరిశీలించమని కోరినా, బ్యాంకు మేనేజర్ వెంటనే స్పందించలేదు. రెండు గంటల తర్వాత పరిశీలించగా, క్యూలో ఉన్న మరో మహిళ డబ్బులు దొంగిలించినట్లు తేలింది. మేనేజర్ వెంటనే స్పందించి ఉంటే దొంగ దొరికిపోయేదని బాధితురాలు వాపోయింది. శనివారం ఉదయం చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్