మొయినాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించారు. ఎన్నికల అధికారులకు పలు సూచనలు చేసిన ఆయన, మూర్తుజగూడ రెవెన్యూ పరిధిలోని మాక్ కళాశాలలోని డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లను కూడా సందర్శించారు. ఈ కార్యక్రమంలో మొయినాబాద్ మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, తహసీల్దార్ గౌతమ్ కుమార్, సీఐ పవన్ కుమార్ రెడ్డి, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.