సోమవారం రంగారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 65 ఫిర్యాదులు అందాయి. జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డికి ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.