కుక్కల దాడిలో జింక మృతి
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామ శివారులో అడవి నుంచి దారి తప్పి వచ్చిన జింకపై వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్ర గాయాలైన జింక అక్కడికక్కడే మృతి చెందింది. తెల్లవారుజామున పొలాల్లో జింక మృతదేహాన్ని గుర్తించిన స్థానిక రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని, జింక మృతదేహాన్ని పరిశీలించి, పంచనామా నిర్వహించి, నిబంధనల ప్రకారం ఖననం చేస్తామని తెలిపారు.
