భారత జాతీయ మహిళా సమాఖ్య (AFIW) ఆదిభట్ల సర్కిల్ సమితి మహాసభలో, రంగారెడ్డి జిల్లా గౌరవ అధ్యక్షురాలు పోచమోని నీలమ్మ, ప్రధాన కార్యదర్శి ఎండి ఫైమీద మాట్లాడుతూ, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మహిళల రక్షణ కల్పించడంలో విఫలమయ్యాయని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు రూ. 2500 ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని, లేనియెడల మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. నూతన కమిటీకి క్రమశిక్షణతో పనిచేయాలని, రాజకీయంగా ముందుకు వచ్చి సమస్యలపై పోరాడాలని, 33% మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని, మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని సూచించారు. ఈ సందర్భంగా వట్టి విజయ అధ్యక్షతన నూతన కమిటీని ఏర్పాటు చేశారు.