మెహదీపట్నంలోని కింగ్స్ ప్యాలెస్‌లో జూలై 1న మెగా జాబ్ మేళా జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ మేళాకు SSC, ఆపై అర్హతలు ఉన్నవారు హాజరుకావచ్చు. IT, హెల్త్‌కేర్, ఫార్మా, బ్యాంకింగ్, ఎడ్యుకేషన్ వంటి రంగాల ప్రముఖ సంస్థలు స్పాట్ ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తాయి. ప్రవేశం పూర్తిగా ఉచితం. కొన్ని సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను కూడా కల్పించనున్నాయి. మరిన్ని వివరాలకు 8374315052ను సంప్రదించవచ్చు.