రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వైష్ణవ గార్డెన్లో గురువారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. మహేశ్వరం డిసిపి సునీత రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై, పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వారం రోజులపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.