ట్రిపుల్ ఐటీ జంక్షన్ లో ట్రాఫిక్ ఆంక్షలు

1306చూసినవారు
ట్రిపుల్ ఐటీ జంక్షన్ లో ట్రాఫిక్ ఆంక్షలు
గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద కొనసాగుతున్న పైవంతెన పనుల నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. రమేశ్ ట్రాఫిక్ మళ్లింపు మార్గదర్శకాలను సోమవారం విడుదల చేశారు. రాడిసన్ హోటల్ నుంచి డీఎల్ఎఫ్ మీదుగా ట్రిపుల్ ఐటీ జంక్షన్ వైపు వచ్చే వాహనాలను డీఎల్ఎఫ్ గేట్ నం.1 వరకు మాత్రమే అనుమతిస్తారు. టీసీఎస్ ఉద్యోగులు నాన్ ఎస్ఈజడ్ (సీఎంసీ) గేట్ మీదుగా రాకపోకలు సాగించవచ్చు. లింగంపల్లి, గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల వైపు నుంచి డీఎల్ఎఫ్ మీదుగా రాడిసన్ హోటల్ వైపు వచ్చేవారు ట్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి గచ్చిబౌలి కూడలికి చేరుకుని ఎడమ వైపునకు వెళ్లాల్సి ఉంటుంది.

సంబంధిత పోస్ట్