త్రిబుల్ ఆర్ బాధితులు కలెక్టరేట్ ముట్టడి

4చూసినవారు
త్రిబుల్ ఆర్ బాధితులు కలెక్టరేట్ ముట్టడి
రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద శనివారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ట్రిపుల్ ఆర్ రోడ్ అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ షాద్నగర్ నియోజకవర్గం గ్రామస్తులు, రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు రాజు మాట్లాడుతూ, ట్రిపుల్ ఆర్ రూట్ మ్యాప్ ను వెంటనే మార్చాలని, లేనియెడల నిరసన ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేశంపేట్ మండలం, ఫరూక్నగర్ మండలం, కొందుర్గు మండలాల నుంచి రైతులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్