చట్నీ పడిందని వ్యక్తిని దారుణంగా హత్య చేసిన యువకులు

0చూసినవారు
చట్నీ పడిందని వ్యక్తిని దారుణంగా హత్య చేసిన యువకులు
రంగారెడ్డి జిల్లా నాచారంలో చట్నీ మీద పడిందన్న కారణంతో నలుగురు యువకులు మురళి కృష్ణ అనే వ్యక్తిని కిరాతకంగా హత్య చేశారు. అర్ధరాత్రి కారులో తిరుగుతున్న యువకులను లిఫ్ట్ అడిగిన మురళి కృష్ణను చట్నీ పడటంతో ఆగ్రహించిన యువకులు, అతన్ని కారులో బలవంతంగా ఎక్కించుకుని రెండు గంటల పాటు చిత్రహింసలకు గురిచేశారు. సిగరెట్లతో కాల్చుతూ, కత్తితో పొడిచి, తప్పించుకునేందుకు ప్రయత్నించిన అతన్ని వెంబడించి మరీ హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని మార్గమధ్యంలో పడేసి, కారును పార్క్ చేసి నిందితులు పారిపోయారు. పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

సంబంధిత పోస్ట్