
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. ప్రచారం చేయనున్న సీఎం రేవంత్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి నేరుగా పాల్గొననున్నారు. కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసిన షెడ్యూల్ ప్రకారం, ఈ నెల 30, 31 తేదీల్లో నాలుగు డివిజన్లలో మొదటి విడత ప్రచారం ఉంటుంది. నవంబర్ 4, 5 తేదీల్లో రెండో విడత ప్రచారంలో ఆయన పాల్గొంటారు.




































