భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

1556చూసినవారు
కేబీఆర్ పార్క్ చుట్టూ కొత్త బ్రిడ్జి, అండర్ పాస్ ల నిర్మాణ పనులు మొదలైన నేపథ్యంలో వన్ వే అమలు చేయడంతో బంజారాహిల్స్ విరించి ఆసుపత్రి నుండి కమాండ్ కంట్రోల్ సెంటర్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించిపోయి, నిదానంగా కదలడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.