కూకట్‌పల్లి నియోజకవర్గం కేపీహెచ్‌బీ కాలనీలో మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. జేఎన్‌టీయూ మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన దాడుల్లో నలుగురు నిందితులు అదుపులోకి వచ్చారు. వారి వద్ద నుంచి 9 ఎల్‌ఎస్‌డీ స్టాంపులు, 4 గ్రాముల ఎండీఎంఏ, 150 గ్రాముల గంజాయి, మూడు మొబైల్ ఫోన్లు, టెస్ట్ కిట్లు, స్కూటర్ స్వాధీనం చేసుకున్నారు. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి, నిందితులను కేపీహెచ్‌బీ పోలీసులకు అప్పగించారు. యువతను లక్ష్యంగా చేసుకున్న డ్రగ్స్ ముఠాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.