మహిళలనే లక్ష్యంగా దొంగతనాలు: ముగ్గురు అరెస్ట్

1101చూసినవారు
మహిళలనే లక్ష్యంగా దొంగతనాలు: ముగ్గురు అరెస్ట్
కూకట్​పల్లి పోలీసులు ముగ్గురు మహిళా దొంగలను అరెస్టు చేశారు. బండారి షాలిని, గంబూ మహేశ్వరి, ఉప్పు సరిత అనే ముగ్గురు సభ్యుల ముఠాగా ఏర్పడి రద్దీగా ఉండే మాల్స్, మార్కెట్లు, షాపుల వద్ద మహిళలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తున్నారు. జనవరి 13న మూసాపేటలో నాగమణి అనే మహిళ హ్యాండ్​బ్యాగ్​లో ఉన్న రూ. 40 వేల నగదును వీరే దొంగిలించినట్లు విచారణలో అంగీకరించారు. వీరి నుంచి రూ. 15 వేల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్​కు తరలించారు.

సంబంధిత పోస్ట్