కూకట్‌పల్లి నియోజకవర్గంలోని మూసాపేట లేక్ షోర్ వద్ద శనివారం తెల్లవారుజామున అతివేగంగా వెళ్తున్న స్విఫ్ట్ కారు పోలో కారును ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పోలో కారు అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను ఢీకొని బోల్తా పడింది. ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి, వీరిలో ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. పోలో కారులో ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.