
గద్వాల సోమన్న పుస్తకాలు ఆవిష్కరణ
హైదరాబాద్‌లోని శారదా లైవ్ స్టూడియో, హిమాయత్ నగర్‌లో ఆదివారం గద్వాల సోమన్న రచించిన 'శతమానం భవతి', 'చెంగల్వ పూదండ' పుస్తకావిష్కరణలు ఘనంగా జరిగాయి. సంగీత సాహిత్య సాంస్కృతిక సంస్థ, హైదరాబాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పద్మశ్రీ కొలకలూరి ఇనాక్, ప్రొఫెసర్ కొలకలూరి మధు జ్యోతి, డా. వి. డి. రాజగోపాల్, విశ్రాంత అటవీశాఖ అధికారి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ పుస్తకాలు సాహిత్య ప్రపంచంలో కొత్త వెలుగును ప్రసరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్ లో జరిగిన ఈ కార్యక్రమం సాహిత్య ప్రియులను ఆకట్టుకుంది.


































