41 రోజుల హనుమాన్ చాలీసా పారాయణం ఘనంగా ముగింపు

85చూసినవారు
41 రోజుల హనుమాన్ చాలీసా పారాయణం ఘనంగా ముగింపు
షాద్ నగర్ పట్టణంలో గత 41 రోజులుగా జరుగుతున్న హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం అక్టోబర్ 22న ప్రారంభమై ఘనంగా ముగిసింది. సంటి వీరప్ప ఆధ్వర్యంలో, జై శ్రీరామ్ టీమ్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇంటింటా పారాయణం, శ్రీ సహస్ర లింగేశ్వర వీరాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్‌కి సింధూర ధారణ, పూజ, చాలీసా పారాయణం, పల్లకి సేవ, అన్న ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సంటి వీరప్పతో పాటు ఆలయ కమిటీ సభ్యులను సన్మానించారు. వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్