
క్రికెటర్ గా దేశానికి ఆడలేకపోయాడు..కానీ వరల్డ్ కప్ ను గెలిపించాడు
టీమిండియా మహిళల వరల్డ్‌కప్ విజయానంతరం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ భావోద్వేగంతో తన కోచ్ అమోల్ మజుందార్ కాళ్లకు నమస్కరించడం అందరినీ కదిలించింది. ఆ క్షణం ‘చక్‌దే ఇండియా’ సినిమాలోని ‘కబీర్ ఖాన్’ సన్నివేశాన్ని గుర్తు చేసింది. ఆటగాళ్ల కంటే ఎక్కువగా ఆనందం వ్యక్తం చేసిన ఆ రియల్ లైఫ్ కబీర్ ఖాన్ ఇప్పుడు భారత మహిళా క్రికెట్ విజయానికి ప్రతీకగా నిలిచారు.




