LB నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిపై
కాంగ్రెస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను BRS పార్టీ నాయకులు, కాంటెస్టెడ్ కార్పొరేటర్ మొగ్గ అనిల్ కుమార్ ఖండించారు. బైరామలగూడ చెరువును కబ్జా చేశారనే ఆరోపణలు అవాస్తవమని, సుధీర్ రెడ్డి మచ్చలేని నాయకుడని, అందుకే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని ఆయన అన్నారు. కొందరు తమ నాయకుడిని కించపరిచేలా మాట్లాడటం సిగ్గుచేటని, గతంలో సీఎంకు కూడా మల్కాజిగిరి ఎంపీ స్థానాన్ని ఇప్పించిన గొప్ప నాయకుడు సుధీర్ రెడ్డి అని అనిల్ కుమార్ పేర్కొన్నారు. చిన్న పెద్ద తేడా తెలుసుకుని మాట్లాడాలని, గతంలో ఆయన కాళ్లు మొక్కేవారు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారని విమర్శించారు.