వనస్థలిపురం పీఎస్ పరిధిలోని హస్తినాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం

2చూసినవారు
వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ, నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని, బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులను ఒక కారు ఢీకొట్టింది. కారు సుమారు 100 మీటర్ల వరకు వారిని ఈడ్చుకెళ్లి బోల్తా కొట్టింది. ఈ దుర్ఘటనలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు మృతి చెందగా, నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన యువకులు మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఈసీఈ రెండవ సంవత్సరం చదువుతున్న శివ, సందీప్ జోహెల్ గా పోలీసులు గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్