రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ పరిధిలోని హయత్నగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “99 డేస్ ప్రోగ్రామ్”లో భాగంగా, ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని హయత్నగర్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి, జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ పాపారావు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ డాక్టర్ రవీందర్ జెండా ఊపి ప్రారంభించారు. హయత్నగర్ బస్టాండ్ మీదుగా సాగిన ఈ ర్యాలీలో ప్రజలకు హెచ్ఐవీ/ఎయిడ్స్, హెపటైటిస్, టిబి వంటి వ్యాధులపై అవగాహన కల్పించారు.