ఎల్బీనగర్: ఓపెన్ జిమ్ ను సద్వినియోగం చేసుకోవాలి

66చూసినవారు
ఎల్బీనగర్: ఓపెన్ జిమ్ ను సద్వినియోగం చేసుకోవాలి
ఆరోగ్య పరిరక్షణ కోసం అందరూ నిత్యం వ్యాయామం చేయాలని కొత్తపేట కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్ అన్నారు. మానస ఎంక్లేవ్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను సోమవారం కార్పొరేటర్ ప్రారంభించి మాట్లాడారు. కాలనీవాసులంతా ఓపెన్ జిము సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు జహీరాఖాన్, వెంకట్ రామయ్య, నవీన్, వెంకటేశ్వర్లు, అంజనీ, వసంత, దుర్గా, లక్ష్మీ, నాయకులు మంచి రాజేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్