
వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి
TG: వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం బిల్కల్ గ్రామంలో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ రైతు దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు చేరాల నర్సింలు (39)కు అదే గ్రామానికి చెందిన బండారి నర్సమ్మతో వివాహేతర సంబంధం ఉండేది. ఈ విషయంపై తరచూ గొడవలు జరిగేవి. నర్సమ్మ, ఆమె భర్త పాపయ్య కలిసి పథకం ప్రకారం నర్సింలును రాళ్లతో కొట్టి చంపారని మృతుడి భార్య వసంత పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం రాత్రి పొలం వద్దకు వెళ్లిన నర్సింలు మరుసటి రోజు శవమై కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




