నాగోల్‌లోని రాజీవ్ స్వగృహ సహాభావన టౌన్‌షిప్‌లో ప్లాట్ ఓనర్ల తీర్మానం లేకుండా మెయింటెనెన్స్ పెంచడాన్ని ప్రశ్నించినందుకు ఓ ఫ్లాట్‌కు వారం రోజులుగా కరెంట్ కట్ చేసిన ఘటన చోటుచేసుకుంది. ఫ్లాట్ నెంబర్. కు చెందిన చక్రపాణి అనే వ్యక్తి పాత పద్ధతిలోనే మెయింటెనెన్స్ చెల్లించడంతో కమిటీ సభ్యులు కక్షపూరితంగా విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు. "ప్లాట్ ఓనర్ల తీర్మానం లేకుండానే కమిటీ సభ్యులు మెయింటెనెన్స్ పెంచారు. గతంలో వసూలు చేసిన డబ్బుల ఖర్చులపై ప్రశ్నించినందుకు, అక్రమంగా పెంచడాన్ని వ్యతిరేకించినందుకు నాపై కక్ష కట్టి కరెంట్ కట్ చేశారు" అని బాధితుడు ఆరోపించారు.